ఈనెల 11న జరిగిన విచారణలో పూర్తిగా సహకరించా: కవిత

మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధమన్న కవిత

హైదరాబాద్: దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ చేపట్టిన ఈనెల 11న పూర్తిగా సహకరించినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. 11న విచారణ తర్వాత మరోసారి విచారణకు ఈడీ నోటీసులివ్వగా ఇవాళ్టి విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాలేదు. దిల్లీ మద్యం కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకాలేనని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఈ- మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు తెలిపారు.

మరో రోజు విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నెల 11న జరిగిన విచారణలో ఈడీ అధికారులు అడిగిన పత్రాలను తన న్యాయవాది భరత్‌ ద్వారా కవిత పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మహిళలను కార్యాలయం పిలిచి విచారించకూడదని, అయితే ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధమని కవిత స్పష్టం చేశారు. అంతే కాకుండా అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని పేర్కొన్నారు. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు ఇచ్చాను. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఈనెల 11న సమన్లు ఇచ్చారు. 

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం