ప్రేమించిన యువతికోసం భవనం పై నుంచి దూకిన యువకుడు
యువతికి కోసం రెండేళ్లుగా మద్యానికి బానిస ... నేడు తిరిగిరాని లోకాలకు
హైదరాబాద్: ప్రేమించిన యువతికోసం ఇంటి పై నుంచి వ్యక్తి దూకిన ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం ... షాపూర్ నగర్ కు చెందిన మని కళ్యాణ్ స్థానికంగా ఉన్న కాలనిలో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు మైనర్లు కావడంతో ఇరు కుటుంబాలలో తెలవడంతో అమ్మాయి వాళ్ళు సొంత ఊరికి వెళ్లారు. దీంతో రెండు సంవత్సరాల నుంచి ప్రేమించిన అమ్మాయి కావాలని ఇంట్లో గొడవ చేసేవాడు. మద్యానికి బానిస అయిన యువకుడు ఈనెల 13న మద్యం మత్తులో ప్రేమించిన అమ్మాయి కావాలంటూ బిల్డింగ్ పై నుంచి దూకాడు. దీంతో కుటుంబ సభ్యులు ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox