కమ్మేసిన మేఘాలు... పలు చోట్ల భారీ వర్షాలు

ఎండ వేడిమితో ఉపశమనం

రంగారెడ్డి : నిన్న మొన్నటి వరకు ఎండలు దంచికొటాయి. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మబ్బులు పట్టి ఉంది . మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా వాతావరణం చల్ల బడినది. పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వస్తాం కురిసింది . ఉమ్మడి రంగారెడ్డి లో వికారాబాద్, మర్పల్లి , మోమిన్ పెట్, సంగారెడ్డి  జిల్లా  తదితర ప్రాంతాలలో వడగళ్ల  వాన కురిసింది .ఉరుముల మెరుపుల వాన పడింది. వర్షంతో విద్యుత్  అధికారులు అప్రమత్తమయ్యారు. కరెంటు కోతలు లేకుండా పలు జాగ్రత్తలు  తీసుకున్నారు.

రానున్న ఐదు రోజుల పటు ఉరుముల , మెరుపులతో  మోస్తరు నుంచి భారీ   వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడుతాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే ఐదు రోజులు యెల్లో హెచ్చరిక జారీ చేసింది. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox