హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.. ఎండ వేడిమితో కాస్త ఉపశమనం
పలు జిల్లాల్లోనూ వర్షాలు
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి. గత కొన్ని రోజుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం లభించినట్లైంది. గురువారం ఉదయం భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేయ్యగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల వడగండ్ల వర్షం కురిసింది. వానల తరుణంలో ఆయా శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox