నాగచైతన్య 'కస్టడీ' టీజర్ విడుదల

చైతూ జోడీగా కృతి శెట్టి

హైదరాబాద్: నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక ద్విభాషా చిత్రం చేశాడు .. ఆ సినిమా పేరే 'కస్టడీ'. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. మే 12 వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.  శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా, పోస్టర్స్ రిలీజ్ దగ్గర నుంచే అందరిలో ఆసక్తిని పెంచడం మొదలైంది.

అయితే కొంతసేపటి క్రితమే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. 'ఇక్కడ చావు నన్ను వెంటాడుతోంది .. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో నాకు తెలియదు. నిజం ఒక ధైర్యం .. నిజం ఒక సైన్యం .. అది ఇప్పుడు నా కస్టడీలో ఉంది' అనే హీరో డైలాగ్ సినిమాపై ఆత్రుతను పెంచుతోంది.  ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించడం విశేషం. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం