చీటింగ్ కేసులో సన్ రైజర్స్ మాజీ ఆటగాడు అరెస్టు

ఏపీకి చెందిన క్రికెట్ ప్లేయర్ నాగరాజు చీటింగ్ కేసులో అరెస్టు

అమరావతి: సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన మాజీ ఆటగాడు చీటింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. ఏపీకి చెందిన క్రికెట్ ప్లేయర్ నాగరాజు చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. నాగరాజు బుడుమూరు గతంలో రంజీ మ్యాచ్ లలో ఆడాడు. ముంబైకి చెందిన వ్యాపారికి ఫోన్ చేసి వర్ధమాన క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్ కు రూ. 12 లక్షల స్పాన్సర్ కావాలని కోరిన కేసులో నాగరాజును ముంబయి సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

ఏపీ సీఎం వ్యక్తిగత సహాయకుడినంటూ వ్యాపారిని బురిడీ కొట్టించిన నాగరాజు, నేషనల్ క్రికెట్ అకాడమీ, ఏపీ క్రికెట్ అసోసియేషన్, రికీభుయ్ ల పేర్లు వాడుకుని సొమ్ముని కాజేశాడు. పోలీసుల విచారణలో నేరాన్ని నాగరాజు అంగీకరించాడు. కాగా ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఎపి జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో), 2016-2018 మధ్యలో ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం