అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారు: ఏఆర్ రెహమాన్
ఆర్‌ఆర్‌ఆర్‌కు బదులు గుజరాతి చిత్రమైన చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారని వ్యాఖ్య
హైదరాబాద్: అర్హతలేని సినిమాలను ఆస్కార్‌కు పంపిస్తున్నారని, కానీ అలా చూస్తుండటం తప్ప మనం ఏమి చేయలేమని స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆరోపించాడు. కొన్ని సార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయని రెహమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. అర్హత ఉన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్ పంపకపోవడంపై ఇన్‌డైరెక్ట్‌గా ఏ.ఆర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్‌లు సాధించి చరిత్ర సృష్టించాడు. ఆర్‌ఆర్‌ఆర్‌కు బదులు గుజరాతి చిత్రమైన చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్‌కు పంపించారు. కానీ ఇది ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దాంతో చాలా మంది సినీ ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను పంపిస్తే ఉత్తమ చిత్రం విభాగంలో కూడా ఆస్కార్ వచ్చేదని పలువురు నెటీజన్లు వ్యక్తం చేశారు. కాగా 'చెల్లో షో' సినిమాను గతేడాది కూడా ఆస్కార్‌కు పంపించారు. అప్పుడు కూడా ఫైనల్ నామినేషన్‌లో చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox