తెలంగాణాలో ప్రముఖ రైల్వే స్టేషన్లు

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం

తెలంగాణ ఉద్యమ చరిత్ర:
తెలంగాణ అభివృద్ధిలో రైల్వే స్టేషన్ లు ప్రముఖ పాత్ర వహించాయి . 
నాంపల్లి రైల్వే స్టేషన్ :

  • 1907 వ సంవత్సరంలో నిజం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ను నిర్మించాడు. 
  • దీనిని మొదట్లో హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా అంటారు . ఇది తడి తడి ప్రాంతం కావడం తోని దీనికి నాంపల్లి అని పేరు వచ్చింది. ఉర్దూ భాషలో నాంపల్లి అంటే నామ్ తడి తడి ఉన్న భాగం అని పల్లి అనే ప్రాంతం అని అర్థం. ఈ స్టేషన్ ను పబ్లిక్ గార్డెన్ ను నిర్మించే సమయంలో నిర్మించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే పబ్లిక్ గార్డెన్ ఉంటది. 
  • దీనిని  ప్రధానంగా వస్తువుల రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగించారు. 
  • ఆ తరువాత మొట్ట మొదటి  ప్యాసింజర్ రైలు 1921 సంవత్సరంలో ఈ  స్టేషన్ నుంచి ప్రారంభమైంది. 
  • దక్షిణ మధ్య రైల్వే వ్యవస్థలో భాగంగా తొలిసారి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సూపర్ ఫాస్ట్  ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ ప్రారంభమయ్యాయి . 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox