టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం.. తెలంగాణ జాగ్రఫీ

టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రత్యేకం

తెలంగాణ జాగ్రఫీ 
నదీ వ్యవస్థ 
మంజీరా నది: రాష్ట్రం లో గోదావరి నదిలో కలిసే  ముఖ్య ఉపనది  మంజీరా నది. 

>ఈ  నది అజీవ నది. అంటే ఎండా కాలంలో ఈ  నది ఎండి పోతుంది . 
> మంజీరా నదీ యొక్క జన్మ స్థలం బాలాఘాట్ కొండలోని జొంఖేడ్ కొండలు. ఇవి మహారాష్ట్రాలో ఉన్నాయి. 
>ప్రవహించే రాష్ట్రాలు: మహారాష్ట్రా,  కర్ణాటక, తెలంగాణ. 
> మంజీరా నది గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనదీ. 
> ఈ నది  పొడవు 724 కిలో మీటర్లు.
> పరిహారక ప్రాంతం 30,844 చ. కి . మీ 
> తెలంగాణాలో ప్రవేశ ప్రదేశం: నాగలిగిద్ద దగ్గర.. ఈ  ప్రాంతం సంగారెడ్డి జిల్లాలో ఉంది 
>  ప్రవహించే జిల్లాలు: మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్. 
> గోదావరిలో కలిసే ప్రాంతం కందకుర్తి నిజామాబాద్ 
> మంజీరా ఉపనదులు: కౌలాస్ నాలా, నల్ల వాగు, కాకి వాగు. 
> మంజీరా నదిపై గల డ్యాములు: నిజం సాగర్  ఇది కామారెడ్డి జిల్లాలో ఉంది. సింగూరు ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది.  

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox