విమర్శలకు బ్యాట్ తో సమాధానం చెప్పినా కే ఎల్ రాహుల్
ఫామ్ కోల్పోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న రాహుల్
హైదరాబాద్: ఒకపుడు టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ గా కొనసాగిన కే ఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా సమయం కోసం వేచి చూశాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో విఫలమైన నేపథ్యంలో జట్టు లో చోటు దక్కుతుందా అని అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కరిగా జట్టులో స్థానం సంపాదించాడు. బ్యాటింగ్ లో జులిపించాడు. ఐదవ స్థానంలో వచ్చి ఇన్నింగ్స్ నిర్మించిన తీరు అద్భుతం. మరోసారి తాను ఎంత కీలకమైన ఆటగాడో అనినిరూపించాడు. కీలక సమయం లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు, అంతే కాకుండా అర్థ శతకం కొట్టారు . కీపింగ్ లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. స్మిత్ ఇచ్చిన క్యాచ్ ను కళ్లు చెదిరే డైవ్ తో పట్టి అందరిని ఆకట్టుకున్నాడు .
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox