అతిపెద్ద సైబర్ స్కాం గుట్టు రట్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు మరియుదేశంలోని కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత డేటాను విక్రయించిన సైబర్ దొంగలను అరెస్టు చేశారు .

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ స్కామ్‌ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు మరియుదేశంలోని కోట్లాది మంది వ్యక్తుల వ్యక్తిగత డేటాను విక్రయించిన సైబర్ దొంగలను అరెస్టు చేశారు . ఈ సందర్భంగా 16 కోట్ల మంది పౌరుల డేటాను విక్రయించినట్లు వివరించారు. వివరాల ప్రకారం.. డేటా తస్కరించి విక్రయిస్తున్న సైబర్ దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో డేటా చోరీపై పోలీసులు దృష్టి సారించారు. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కాగా, వీరు ఢిల్లీ, నాగ్‌పూర్‌, ముంబైకి చెందిన ముఠాగా గుర్తించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox