నియామక పరిక్షలు ఇక ఆన్లైన్ లో నిర్వహించే యోచనలో టీఎస్‌పీఎస్సీ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రం లో సంచలనం గా మారింది . లక్షలాది విద్యార్థులు నమ్మకాన్ని టీఎస్‌పీఎస్సీ కోల్పోయింది ! రాజకీయ దుమారం రేగుతోంది
హైదరాబాద్ : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రం లో సంచలనం గా మారింది . లక్షలాది విద్యార్థులు నమ్మకాన్ని టీఎస్‌పీఎస్సీ కోల్పోయింది ! రాజకీయ దుమారం రేగుతోంది . టీఎస్‌పీఎస్సీ లో పని చేసే వారే ఈ ఘటనకు సూత్ర దారులు అని పోలీసు విచారణలో తేలింది . ఇది ఇలా ఉండగా టీఎస్‌పీఎస్సీదిద్దుబాటు చర్యలకు పూనుకుంది . రానున్న పరీక్షలు ఆన్లైన్ లో పెట్టే యోచనలో ఉంది . ఇందుకోసం సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు . ఇప్పటివరకు 25 వేల అభ్యర్థులకు మాత్రమే ఆన్లైన్ పెట్టేవారు . ఇప్పుడు దానిని 50 వేల వరకు పెంచే యోచనలో ఉన్నారు . ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్ పరీక్షలు నిర్వహింస్తున్న పలు సంస్థలను పరిశీలించనున్నరు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటె ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వయించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది . ఇలా నిర్వహిస్తే నార్మలైజషన్ విధానం అమలు చేయాలి. తొలుత ప్రొఫెషనల్ పోస్టులకు ఈ విధానం అమలు చేయాలని భావిస్తోంది . ఇలాంటి విధానం ఇప్పటికే ఇతర రాష్ట్ర లలో అమలు అవుతుంది . స్టాప్ సెలక్షన్ కమిషన్ , ఐబీపీస్ ఇతర సంస్థలు సమర్థవతంగా పరీక్షలు నిర్వహింస్తున్నాయి . మరో వైపు ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు గణనీయంగా పెరుగుతున్నారు . లక్షల సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సవాలుతో కుడుకున్నది . ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు .
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox