ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తొలి పది ర్యాంకుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలో ఏడు, ఎనిమిది, పది ర్యాంకుల్లో నిలిచారు. సనపాల అనిరుధ్(విశాఖపట్టణం) తొలి ర్యాంకు సాధించగా, మణింధర్ రెడ్డి(గుంటూరు) రెండో ర్యాంకు, ఉమేశ్ వరుణ్(నందిగామ) మూడో ర్యాంకు, అభిణిత్ మజేటి(హైదరాబాద్) నాలుగో ర్యాంకు, ప్రమోద్ కుమార్ రెడ్డి(తాడిపత్రి) ఐదో ర్యాంకు, మారదన ధీరజ్(విశాఖపట్టణం) ఆరో ర్యాంకు, వడ్డే శాన్విత(నల్లగొండ) ఏడో ర్యాంకు, బోయిన సంజన(శ్రీకాకుళం) ఎనిమిదో ర్యాంకు, నంద్యాల ప్రిన్స్ బ్రనహం రెడ్డి(నంద్యాల) తొమ్మిదో ర్యాంకు, మీసాల ప్రణతి శ్రీజ(విజయనగరం) పదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్, మెడికల్ టాప్ టెన్ ర్యాంకర్లు..
తొలి ర్యాంకు – బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్(ఈస్ట్ గోదావరి)
రెండో ర్యాంకు – నశిక వెంకట తేజ(చీరాల)
మూడో ర్యాంకు – సఫల్ లక్ష్మీ పసుపులేటి(రంగారెడ్డి)
నాలుగో ర్యాంకు – దుర్గంపూడి కార్తీకేయ రెడ్డి(గుంటూరు)
ఐదో ర్యాంకు – బోర వరుణ్ చక్రవర్తి(శ్రీకాకుళం)
ఆరో ర్యాంకు – దేవగుడి గురు శశిధర్ రెడ్డి(హైదరాబాద్)
ఏడో ర్యాంకు – వంగీపురం హర్షిల్ సాయి(నెల్లూరు)
ఎనిమిదో ర్యాంకు – దద్దనాల సాయి చిద్విలాస్ రెడ్డి(గుంటూరు)
తొమ్మిదో ర్యాంకు – గంధమనేని గిరి వర్షిత(అనంతపురం)
పదో ర్యాంకు – కోళ్లబత్తుల ప్రీతం సిద్ధార్థ్ (హైదరాబాద్)
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox