హైదరాబాద్ టు ఫ్రాంక్‌ఫర్ట్ డైరెక్ట్ ఫ్లైట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి.
హైదరాబాద్ : హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా వివిధ దేశాలకు విమానాల రాకపోకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ సిటీకి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా విమానాలు నడవనున్నాయి. ఈ విమాన రాకపోకలకు సంబంధించి ఎయిపోర్టు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు లుఫ్తాన్సా విమానం రాకపోకలు కొనసాగించనుంది. ఈ మార్గంలో తొలి విమానం 2024, జనవరి 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ విమానంలో 26 బిజినెస్ క్లాస్ సీట్లు, 21 ప్రీమియం ఎకానమీ సీట్లు, 247 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తొలి విమానం ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి జనవరి 16న ఉదయం 10 గంటలకు బయల్దేరి, హైదరాబాద్‌కు రాత్రి 11 గంటలకు చేరుకుంది. మళ్లీ హైదరాబాద్ నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బయల్దేరి, ఉదయం 6:10 గంటలకు చేరుకోనుంది. ఫ్రాంక్‌ఫర్ట్ – హైదరాబాద్ మధ్య 8 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణం కొనసాగనుంది.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు మంగళ, శుక్ర, ఆదివారాల్లో విమానాలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉండనున్నాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox