మోదీకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నూతన

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చారిత్రాత్మకమైందని, చారిత్రక కట్టడాన్ని నిర్మించేందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి , కేంద్రానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో తెలిపారు. పార్లమెంటు భవనం చట్టాల రూపకల్పనకు వేదిక కావాలని, 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పేదలు లేని దేశానికి కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచిగా నిలవాలని చంద్రబాబు అన్నారు.

కాగా, మహానాడు వేదికగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులకు చంద్రబాబు డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు అందజేస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో గణనీయమైన మార్పులకు ఎన్టీఆర్ నాంది పలికారని చంద్రబాబు వెల్లడించారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం