రూ. 2 వేల నోటు ఇస్తే.. రూ.500 పెట్రోల్ కొట్టించుకోవాలట

రూ. 2,000 నోటును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రజలు 2 వేల నోటును మార్చుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు

హైదరాబాద్ : రూ. 2,000 నోటును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రజలు 2 వేల నోటును మార్చుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరు బ్యాంకుల్లో నిలబడి టైమ్ వేస్ట్ సుకోవడం ఎందుకని ఆ రెండు వేల నోటుతో బంగారాన్ని కొంటున్నారు.. మరికొందరు తెలివిగా పెట్రోల్ బంకుల్లో ఇచ్చి, పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. దీంతో వంద రూపాయల పెట్రోల్ కు 2వేల నోటు ఇస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అదే అదునుగా తిసుకొని యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. 

హైదరాబాద్ పాత బస్తీలోని పలు పెట్రోల్ పంప్ యజమానులు రూ.2000 నోట్లపై విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెట్రోల్ పంప్ వినియోగదారులకు సేవలందిస్తున్న పంపుపై రూ.2000 నోటుపై రూ.500 వరకు పెట్రోల్, డీజిల్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ నోటీసును అతికించింది.
 
దీనిపై వినియోగ దారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రూ. 500 పెట్రోల్ అవసరం లేకుండా ఎవరూ కొట్టించుకుంటారని వినియోగదారులు ప్రశ్నించారు. దీనిపై బంక్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే చాలా మంది వినియోగదారులు కావాలనే 2వేల చిల్లర మార్చుకోవడం కోసం బంక్ కు వస్తున్నారని పెట్రోల్ బంక్ సిబ్బంది చెబుతున్నారు. కేవలం వంద రుపాయలే పెట్రోల్ కొట్టించుకోని రెండు వేల నోటు ఇస్తున్నారని.. తమ దగ్గర అసలు చిల్లర ఉండడంలేదని వాపోతున్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox