పూదీనా మఖానా మ్యాంగో షేక్ టేస్ట్కు టేస్ట్..ఆరోగ్యానికి ఆరోగ్యం
పండ్లల్లో రారాజు మామిడిపండు. వేసవి కాలంలో మామిడి పండ్లు నోటిని ఊరిస్తాయి. మ్యాంగ్ ను చూసి టెంప్ట్ అవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదు.
పండ్లల్లో రారాజు మామిడిపండు. వేసవి కాలంలో మామిడి పండ్లు నోటిని ఊరిస్తాయి. మ్యాంగ్ ను చూసి టెంప్ట్ అవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదు. కొందరైతే మామిడి పండ్లు జుర్రుకుంటూ తినేస్తుంటారు. మరికొందరు పండ్లను జ్యూస్ లుగా చేసుకుని మామిడి టేస్ట్ ను ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు.. మ్యాంగో షేక్ ను ఆస్వాదిస్తారు. సాధారణంగా మ్యాంగో షేక్ ను పాలతో తయారు చేస్తారు. కానీ పాలకు బదులుగా పెరుగుతో మ్యాంగో షేక్ ను ఎలా తయారు చేస్తారో..పెరుగుతో తయారు చేసిన మ్యాంగో షేక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
పుదీనా మఖానా మ్యాంగో షేక్ ఎలా తయారు చేయాలంటే..
మామిడి షేక్ చేయడానికి పెరుగు, మఖానా, చక్కెర, మామిడిపండ్లు అవసరం. పెరుగులో మామిడిపండు ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. మఖానాను ముందుగా నీళ్లలో నానబెట్టాలి. నానబెట్టిన మఖానా బాగా నానిన తర్వాత వాటికి కొన్ని నీటిని కలపాలి. పైన పుదీనా ఆకులు, పంచదార, నల్ల ఉప్పు లేదా ఉప్పు వేయాలి. వీటన్నింటినీ కలిపి మిక్సీ చేస్తే మ్యాంగో షేక్ రెడీ.
పుదీనా మఖానా మామిడి షేక్ వల్ల ప్రయోజనాలు:
ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది
పుదీనా మఖానా మ్యాంగో షేక్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఈ మ్యాంగో షేక్ పొట్టను శుభ్రం చేయడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం ఖచ్చితంగా మ్యాంగో షేక్ తాగండి.
ఈ మాంగోషేక్ ప్రోబయోటిక్
మ్యాంగో షేక్ ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ఆరోగ్యానికి అనేక విధాలుగా పని చేస్తుంది. మ్యాంగో షేక్లో పెరుగును కలపడం ద్వారా ప్రోబయోటిక్, గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రోబయోటిక్ కడుపుని చల్లబరుస్తుంది. వేసవిలో కడుపులో వచ్చే సమస్యలను నివారిస్తుంది.
డీ హైడ్రేషన్ ను నివారిస్తుంది.
మ్యాంగో షేక్ డీ హైడ్రేషన్ను నివారిస్తుంది. శరీరానికి తాజాదనాన్ని తెస్తుంది. అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. మ్యాంగో షేక్ పాదాల మంటను తొలగించడమే కాకుండా చర్మ సమస్యలను నయం చేస్తుంది.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox