గుజరాత్, ముంబైలో ఫైనల్ చేరేదెవరో?.. నేడే ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్
ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది.
అహ్మదాబాద్: ఐపీఎల్లో ఐదు టైటిళ్లు నెగ్గి అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది. లీగ్ దశలో ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ముందడుగు వేసిన ముంబై.. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. అదే జోరులో శుక్రవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడేందుకు సిద్ధమైంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో లీగ్ దశను ముగించిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్‌కు సొంతగడ్డపై ఆడనుండటం సానుకూలాంశం కాగా..
సీజన్ చివరి దశకు వస్తున్నా కొద్ది ముంబైకి మ్యాచ్ విన్నర్లు ఎక్కువవుతున్నారు. లీగ్ దశ చివర్లో కామెరూన్ గ్రీన్ బ్యాట్‌తో విశ్వరూపం కనబరుస్తుంటే.. బౌలింగ్‌లో ఆకాశ్ మధ్వాల్ రూపంలో ముంబైకి మరో హీరో దొరికాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డావిడ్, నేహల్ వధేరా రూపంలో ముంబై బ్యాటింగ్ శత్రుదుర్భేద్యంగా కనిపిస్తున్నది. గుజరాత్‌కు గిల్, సాహా, హార్దిక్, శంకర్, మిల్లర్, తెవాటియా, రషీద్‌ఖాన్ రూపంలో బలమైన సైన్యమే ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే.. ముంబై కంటే గుజరాత్ వైపే కాస్త మొగ్గు కనిపిస్తున్నది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమీ, మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటం టైటాన్స్‌కు అదనపు బలం చేకూర్చనుంది. గత మ్యాచ్‌లో లక్నోపై 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన ముంబై పేసర్ ఆకాశ్ జోరుమీదున్నా.. అతడికి సహకరించే మరో దేశీ పేసర్ కనిపించడం లేదు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox