వీధి కుక్కల దాడి.. మూడేళ్ల బాలుడి పరిస్థితి విషమం

హైదరాబాద్ లో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి.

హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజురోజుకు కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో కుక్కల దాడికి ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.   కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఆర్ డీఓ టౌన్‌షిప్‌లో ఐదు కుక్కలు మూడేళ్ల బాలుడిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాయి. ట్యూషన్‌ నుంచి వస్తుండగా చిన్నారిపై ఒక్కసారిగా కుక్కలు విరుచుకుపడ్డాయి. తీవంగ్రా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాలుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox