తెలంగాణ ఉద్యమ కారుడు పండిట్ రావు కు సామాజిక కార్యకర్తలు సన్మానం

తెలంగాణ ఉద్యమ కారుడు పండిట్ రావు కు సామాజిక కార్యకర్తలు సన్మానం

రంగారెడ్డి :  తెలంగాణ ఉద్యమ కారుడు పండిట్ రావు కు  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాని పురస్కరించుకొని సామాజిక కార్యకర్తలు సన్మానం చేశారు . శంకరపల్లి తెలంగాణ ఉద్యమ ఉనికి లేని ప్రాంతం.. ఆ సమయం లో  ఆ ప్రాంతంలో ఒక సూర్యుడు లాంటి వ్యక్తి ముందుకొచ్చి  ఉద్యమ కిరణాలను వెలజల్లి ప్రతి తెలంగాణ బిడ్డను తట్టి  లేపారు .  నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదంతో జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ వీధులలో గ్రామ గ్రామాలలో జెండాను భుజానకేత్తుకున్న ఒక మహోన్నత వ్యక్తి  పండిత్ రావు . మలిదశ ఉద్యమంలో శంకర్పల్లి ప్రాంతంలో  ప్రజలలో తెలంగాణ  వాదాన్ని , జాతిని జాగృతం చేసి ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప నాయకుడు  పండిత్ రావు. తెలంగాణ ఆకాంక్షను వివరించిన ఉద్యమ రథ సారధి .   తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని సామాజిక కార్యకర్తలు ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox