తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్థి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్‌లో సెహ్జెల్ అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ర్కింగ్ దగ్గర బాధితురాలు విషం తాగింది. ఆమెను వెంటనే తెలంగాణ భవన్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సెహ్జెల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చిన్నయ్య తనను ఆర్థికంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని 2 రోజుల క్రితం ఎన్‌హెచ్ఆర్‌సీ , జాతీయ మహిళా కమిషన్‌ను బాధితురాలు కలిసింది. ఎమ్మెల్యే అనుచరులు తన ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే, అతని అనుచరుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెహ్జెల్ లేఖలో వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన చావు తర్వాత అయినా తన కుటుంబానికి న్యాయం జరుగుతుందని లేఖలో సెహ్జెల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox