ఏపీలో బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన
ఏపీలో బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన
హైదరాబాద్ : ఏపీలో బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన ఖరారైంది. దేశంలో ప్రధాని మోదీ పాలనకు 9 వసంతాలు పూర్తైన సందర్భంగా.. ఏపీలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా... బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.ఈ బహిరంగసభల్లో 9 ఏళ్ల పాలనలో ఏపీకి కేంద్రం నుంచి ఏం చేశాం ? ఎన్నివేల కోట్ల నిధులిచ్చాం? అన్నవాటిపై బహిరంగ సభల ద్వారా వివరించనున్నారు. కాగా.. రాష్ట్రంలో ఈ ఇద్దరి పర్యటనతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలతో భేటీ అయి పొత్తులపై చర్చించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటనతో పొత్తు ఖరారు చేస్తారా ? బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తాయా ? లేక బీజేపీ -జనసేన- టీడీపీ కలుస్తాయా? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox