డీఆర్డీవో ఉద్యోగాలు..భారీగా వేతనం

డీఆర్డీవోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 181 సైంటిస్ట్‌ B పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సైన్స్ లో ఇంజినీరింగ్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యలు ఈ పోస్టులకు అర్హులు.

 హైదరాబాద్ : డీఆర్డీవోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 181 సైంటిస్ట్‌ B పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సైన్స్ లో ఇంజినీరింగ్‌, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యలు  ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు https://rac.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌  చేసుకోవాలని డీఆర్డీవో సూచించింది. రిజిస్ట్రేషన్ జనరేట్ అయినప్పటి నుంచి 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. 

విద్యార్హతలు: పోస్టులను బట్టి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్‌ అండ్ కమ్యూనికేషన్స్‌/మెకానికల్‌/కంప్యూటర్‌సైన్స్‌/ఎలక్ట్రికల్‌/మెటీరియల్‌ సైన్స్‌/కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌/సివిల్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో బీటెక్‌ పాసై ఉండాలి.  మరి కొన్ని ఉద్యోగాలకు ఎమ్మెస్సీ ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మేథమెటిక్స్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో పాసై ఉండాలి.  దీంతో పాటు గేట్‌ స్కోరు కీలకం.

చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే  ఆగస్టు 31 నాటికి అభ్యర్థులు తమ డిగ్రీ/ప్రొవిజనల్‌ డిగ్రీ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 181 పోస్టుల్లో దివ్యాంగులకు ఏడు పోస్టులను రిజర్వు చేశారు. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఈ ఉద్యోగాలు పొందిన వారికి  మెట్రో  నగరాల్లో నెలకు దాదాపు రూ.లక్ష వరకు జీతం చెల్లిస్తారు. 
 
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులు సాధించిన గేట్‌ స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం