జూన్ 9న చేప ప్రసాదం పంపిణీ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: తలసాని

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .

 హైదరాబాద్ : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .  జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా బత్తిన సోదరులు పంపిణీ చేయనున్నారని తెలిపారు. కరోనా వల్ల గత మూడేళ్లుగా  చేప ప్రసాదాన్ని నిలిపివేశారు. మళ్లీ ఈ ఏడాది నుంచి చేప మందును పంపిణీ  చేస్తున్నారు . బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాదిగా తరలి వస్తారన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 
250 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వాలంటీర్‌లు పని చేస్తున్నారన్నారని మంత్రి తలసాని అన్నారు. చేప ప్రసాదం ఇంటికి తీసుకెళ్లాడానికి కార్తీ కౌంటర్లు కూడా పెంచినట్లు వెల్లడించారు. గోషామహల్ ప్రజలు సహకరించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో సర్వీసులు, నాంపల్లి నుంచి రైల్వే సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం