ఆదిత్య-ఎల్1 లాంచ్ రిహార్సల్స్ పూర్తి: ఇస్రో
సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య-ఎల్1మిషన్ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి
న్యూఢిల్లీ: సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టే ఆదిత్య-ఎల్1మిషన్ ప్రయోగం కోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్యను నింగిలోకి పంపనున్నారు. అయితే ఆ మిషన్ లాంచింగ్‌కు ముందు చేపట్టే రిహార్సిల్స్ అన్నీ పూర్తి అయినట్లు ఇవాళ ఇస్రో తన ట్వీట్‌లో తెలిపింది. ఆదిత్య-ఎల్1 మిషన్‌కు చెందిన అన్ని వెహికల్ ఇంటర్నల్ చెక్స్‌ను పూర్తి చేసినట్లు కూడా ఇస్రో చెప్పింది. ఆదిత్య-ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన కొన్ని ఫోటోలను ఇస్రో తన సోషల్ మీడియా అకౌంట్‌లో పబ్లిష్ చేసింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య-ఎల్1 నింగిలోకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ర్యుడి-భూమి కక్ష్యలోని లగరేంజ్ పాయింట్(ఎల్-1) వద్ద ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉంచుతారు. ఆ పాయింట్ భూమికి దాదాపు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్-1 పాయింట్‌లో శాటిలైట్‌ను నిలపడం వల్ల.. సూర్యుడిని నిరంతరం చూసే అవకాశం ఉంటుందని ఇస్రో ఓ ప్రకటనలో చెప్పింది.
ఆదిత్య ఎల్1 స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఏడు పేలోడ్స్ ఉన్నాయి. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బహ్యభాగం, సూర్యుడి కేంద్రకం కరోనాతో పాటు ఇతర ప్రాంతాలను స్టడీ చేయనున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్, పార్టికల్, మ్యాగ్నటిక్ ఫీల్డ్ డిటెక్టర్లతో ఈ స్టడీ చేపడుతారు. ఎల్1 పాయింట్ నుంచి నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యున్ని వీక్షించనున్నాయి. ఇక మిగితా మూడు పేలోడ్స్ మాత్రం ఆ పాయింట్ వద్ద ఉన్న పదార్ధాలను స్టడీ చేయనున్నాయి. ఈ పేలోడ్స్ వల్ల సౌర వ్యవస్థకు చెందిన కీలకమైన శాస్త్రీయ సమాచారం దొరుకుతుందని భావిస్తున్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox