మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్
బాన్సువాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణ మరియు సంఘ సభ్యుల అధ్వర్యంలో
హైదరాబాద్ : బాన్సువాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు పాత బాలకృష్ణ మరియు సంఘ సభ్యుల అధ్వర్యంలో తయారు చేయించిన మట్టి గణపతి విగ్రహాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ....మట్టి గణపతిని పూజిద్దాం, ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యవరణాన్ని పరిరక్షిద్దాం .. ప్రజలందరికీ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటూ,గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూన్నాను అని అన్నారు .
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox