దనం చెరువును పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గములోని కార్పొరేషన్లు,మునిసిపాలిటీలలోని 11 చెరువులను 47 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు.

హైదరాబాద్ : మహేశ్వరం నియోజకవర్గములోని కార్పొరేషన్లు,మునిసిపాలిటీలలోని 11 చెరువులను 47 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పేర్కొన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు వాకర్స్,సీనియర్ సిటీజన్లతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా వారంతా మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి రోజు,ఉదయం సాయంత్రం వందలాది మంది సేదదీరుతున్నారని,వాకింగ్,వ్యాయామం,చిన్న పిల్లలు అడుకోవటానికి సదుపాయాలు కల్పించి,సుందరికరణ చేపట్టినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఒక విజన్ తో చేపట్టిన పనులు భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు.చందనం చెరువు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిఈ గోపీనాథ్ కు మంత్రి ఆదేశించారు. పలు చోట్ల డస్ట్ బీన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.చెరువుల వద్ద ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రతి ఒక్కరూ సెదదిరేలా ఏర్పాట్లు చేసినట్లు,ప్రజలు కూడా ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.పోలీస్ తో పాటు వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈవెంట్లకు సిద్ధం అవ్వటానికి వాకింగ్ ట్రాక్,తదితరాలు ఉపయోగపడతాయని అన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox