ఢిల్లీలో నారా లోకేశ్ ధర్నా..

ఏపి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టిడిపి ఉఎంపీలు, పలువురు ఎంఎల్ఎలతో కలిసి నారా లోకేశ్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు

హైదరాబాద్: ఏపి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టిడిపి ఉఎంపీలు, పలువురు ఎంఎల్ఎలతో కలిసి నారా లోకేశ్ ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరగలేదని , తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆందోళన చేశారు. చంద్రబాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ ఏ విధంగా ఉందో చూడొచ్చన్నారు.

 

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox