తెలంగాణలోనే ముస్లింలు భద్రంగా ఉన్నారు: ఒవైసీ

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు

హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు దారుణమైన పరిస్థితి ఉండేదన్నారు. కర్ణాటకతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ సుపరిపాలనలో శాంతిభద్రతలకు లోటు లేదని, రాష్ట్రంలో దాడులు జరగలేదన్నారు.

థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశంలో మూడో ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కేసీఆర్, మాయావతి ఏ కూటమిలోనూ లేరని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ కారుకు పంక్చర్ వచ్చిందని, ఖర్చుల హవాను జనం పూర్తిగా దూరం చేశారని ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు. దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్లపై కూడా తమ అభిప్రాయం చెబితే బాగుంటుందని ఒవైసీ అన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం