నేడు గాంధీ జయంతి ... మహాత్ముని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

అక్టోబర్​ 2న మహాత్మా గాంధీ జయంతి. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..

:హైదరాబాద్ :  అక్టోబర్​ 2న మహాత్మా గాంధీ జయంతి. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..

జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. అహింసా మర్గంలో నడిచి, విజయం సాధించవచ్చని ఆయన నిరూపించిన విధాగం.. ఎందరిలోనో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చింది. అక్టోబర్​ 2, మహాత్మా గాంధీ 154వ జయంతి నేపథ్యంలో ఆయన గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాము..

 గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

1930లో మహాత్మా గాంధీకి 'మ్యాన్​ ఆఫ్​ ది ఇయర్​' బిరుదును ఇచ్చింది టైమ్​ మ్యాగజైన్​. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు గాంధీ.

సౌతాఫ్రికాలో గాంధీజీ.. ఏడాదికి 15000 డాలర్లు సంపాదించేవారు. ఇప్పటికీ చాలా మందికి ఇదొక కల! దానిని వదులుకుని ఇండియాకు తిరిగొచ్చారు.

 ఓ సందర్భంలో రైలు దిగుతుండగా.. గాంధీ కాలికి ఉన్న ఒక చెప్పు ట్రాక్​పై పడిపోయింది. వెంటనే ఆయన మరో కాలికి ఉన్న చెప్పును కూడా పడేశారు. ఎవరికైతే ఒక చెప్పు దొరుకుతుందో, రెండోది కూడా తీసుకుంటారని ఆయన అలా చేశారు.

 

సౌతాఫ్రికాలో ఉండగా.. 1906లో బ్రిటీష్​ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరిగింది. దీనిని బంబాథ అప్​స్ప్రింగ్​ అంటారు. ఇందులో గాయపడిన బ్రటీష్​ సైనికులకు గాంధీ సాయం చేశారు. 

 

మహాత్మా గాంధీ రాసిన ఆటోబయోగ్రఫీ "మై ఎక్స్​పరిమెంట్స్​ విత్​ ట్రూత్​".. 1927లో పబ్లీష్​ అయ్యింది. 20వ శతాబ్దాంలో 100 మోస్ట్​ ఇంపార్టెంట్​ స్పిరిట్చ్యువల్​ (ఆధ్యాత్మిక) పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది​.

 

ఐరిష్​ యాక్సెంట్​లో గాంధీజీ ఇంగ్లీష్​లో మాట్లాడేవారు. ఆయన మొదటి ఇంగ్లీష్​ టీచర్​ ఓ ఐరిష్​ వ్యక్తి కావడంతో గాంధీకి కూడా అదే యాక్సెంట్​ వచ్చింది.

గాంధీజి పుట్టింది శుక్రవారం నాడు. ఆయన మరణించింది శుక్రవారం నాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కూడా శుక్రవారమే!

 

గాంధీకి "మహాత్మా" అన్న బిరుదును రవింద్రనాథ్​ ఠాగూర్​ ఇచ్చారు. ఓసారి ఠాగూర్​ను కలిసిన గాంధీజీ.. 'నమస్తే గురుదేవ్​' అని సంబోధించారు. అందుకు బదులుగా.. ​ "నేను గురుదేవ్​ అయితే మీరు మహాత్ముడు" అని ఠాగూర్ అన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox