గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలే ప్రతి రూపాలు: కెసిఆర్

దేశ స్వాతంత్ర్యానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు.

హైదరాబాద్: దేశ స్వాతంత్ర్యానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రసంగించారు.  ‘సత్యమేవ జయతే’ అనే విశ్వాసం ప్రేరణగా, దేశ ప్రజలకు గాంధీజీ అందించిన ఆశయాలు, సిద్ధాంతాలు, కార్యాచరణ, విజయాల స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, అనంతర స్వరాష్ట్ర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి వున్నాయని సిఎం పేర్కొన్నారు.

వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధితో, పునరుజ్జీవం చెందిన కులవృత్తులతో బలోపేతమైన గ్రామీణ ఆర్థికాభివృద్ధితో, ఆసరానందుకుంటున్నపేదల, పెద్దల చిరునవ్వులతో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతి రూపాలుగా నిలిచాయని కెసిఆర్ ప్రశంసించారు.  గాంధీజీ సిద్ధాంతాలను, కార్యాచరణను జీవన విధానంలో భాగం చేసుకుని స్వీయ నియంత్రణ, అనుసరణలతో ముందుకు సాగడమే ఆయనకు మనమనిచ్చే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox