తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని తెలిపారు.
కాగా, ఆదివారం 88,623 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 43,934 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ..4.67కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox