తెలంగాణ గ్రూప్‌-2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్పీఎస్సీ ) నవంబర్ మొదటి వారంలో నిర్వహించాల్సిన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్పీఎస్సీ ) నవంబర్ మొదటి వారంలో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (TS TRT)లో భాగమైన సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్‌జీటీ) పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాలి.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox





మునుపటి వ్యాసం