ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐసెట్ ప్రకటించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐసెట్ ప్రకటించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ షెడ్యూల్..
ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 15న ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబర్ 16న ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్టోబర్ 16 నుంచి 17 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ ఎంపిక. అక్టోబర్ 17 ఆప్షన్‌లు ఫ్రీజింగ్. అక్టోబర్ 20న సీట్లు తాత్కాలిక కేటాయింపు. అక్టోబర్ 20 నుంచి 29 వరకు వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలి. అక్టోబర్ 30 నుంచి 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ సీట్ల కోసం అక్టోబర్ 30న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు https://tsicet.nic.in వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox