మేడ్చల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ పోట్రు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా గౌతమ్ పోట్రు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా గౌతమ్ పోట్రు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్‌ను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం నూతన కలెక్టర్‌గా గౌతమ్ పోట్రు పేరును సిఫార్సు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గౌతమ్ పోట్రు ఇప్పటి వరకు సెర్ప్ సీఈవోగా విధులు నిర్వహించారు. నూతన కలెక్టర్‌కు జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్‌రెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox