CM KCR Live: పక్క రాష్ట్రం రోడ్లు, మన రోడ్లకు తేడా చూడండి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ​పర్యటన..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడును పెంచారు. రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్.. వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పీడును పెంచారు. రెండో విడత ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్.. వరుస సభలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాదసభల్లో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. మొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలో.. అనంతరం ఇల్లందులో నిర్వహించే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. గత సభల్లో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడంతోపాటు విపక్ష పార్టీలపై ఫైర్ అవుతూ వచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్నారు. ఈ తరుణంలో ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

courtesy:https://tv9telugu.com/videos/political-videos/cm-kcr-live-brs-public-meeting-in-sathupally-yellandu-telangana-elections-2023-1103012.html

Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox