Infosys | ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది.
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా 2020 ఏడాది పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. మహమ్మారి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావడంతో కొన్ని సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. వారానికి కనీసం రెండు, మూడు రోజులైనా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. టీసీఎస్, విప్రో వంటి టాప్ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది.
మిడ్ లెవల్ మేనేజర్లు, ప్రాజెక్ట్ హెడ్‌లు, ఎంట్రీ లెవల్ ఉద్యోగులు నెలలో 10 రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. ‘రిటర్న్ టు ఆఫీస్ విధానం, హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను బలోపేతం చేసే దిశగా.. ఉద్యోగుల్ని నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. 2023, నవంబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని ఇన్ఫీ వైస్‌ప్రెసిడెంట్స్ నుంచి ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందింది.
courtesy:www.ntnews.com/business/infosys-ends-work-from-home-for-lower-level-employees-asks-them-to-come-to-office-for-10-days-a-month-1317580
Subscribe
Subscribe to our newsletter to get the latest scoop right to your inbox