జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్
పరీక్షలలో విజయం సాధించడానికి అడ్డా దారులు తొక్కుతున్నారు అభ్యర్థు
హైదరాబాద్ : పరీక్షలలో విజయం సాధించడానికి అడ్డా దారులు తొక్కుతున్నారు అభ్యర్థులు . ఇటీవల జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కొందరు విద్యార్థలు స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. ఎలక్ట్రానిక్ డివైజ్ ను ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకెళ్లి కాపీ కొట్టారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చింతపల్లి చైతన్య కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాను రాసిన జవాబులను ఓ విద్యార్థి వాట్సాప్ ద్వారా తన మిత్రులకు పంపాడు చైతన్య. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.
ఈ క్రమంలోనే.. ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ దీనిని గమనించి ఆ విద్యార్థిని పట్టుకున్నారు. చైతన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చైతన్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.